మీ అందరికీ ఆనందభైరవి సినిమా గురించి తెలిసే ఉంటుంది … ఆ సినిమా పూర్తి అయ్యాక…దాన్ని కొనే వాళ్ళు దొరకలేదు…సినిమా పూర్తి అయ్యాక దాదాపు గా ఒక సంవత్సరం ఆ సినిమా ని కొనే నాధుడు లేకుండా పోయాడు. కామెడీ సినిమాలు తీసే జంధ్యాల ఇలాంటి సినిమా తీస్తే ఎవరూ చూడరు అన్న గుడ్డి నమ్మకం వల్ల దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. చివరకి దానికి నంది అవార్డు వచ్చాక లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు సినిమా మొత్తం హక్కులు ఇచ్చే పద్దతి మీద కొంటాము అన్నారు. (శంకరాభరణం సినిమాకి కూడా ఇదే జరిగింది). “ఆనంద భైరవి” సినిమా కి నిర్మాతలు బి.ఎ.వి.శాండిల్య పాత్రికేయుడు,సీత పద్మరాజు గారు కూడా మరీ ఎక్కువ ఉన్నవాళ్లు కాదు. దాంతో వాళ్ళకి ఏదో ఒక ధరకి అమ్మక తప్పలేదు. సినిమా విడుదల అయ్యాక జరిగిన విషయాలు మీకు తెలిసినవే…
ఆనందభైరవి విజయం తో శాండిల్య గారు, సీతా పద్మరాజు గారు ఈ సారి ధైర్యం గా ఉండొచ్చు అనుకుని అశ్విని కార్తిక చిత్ర మీద జంధ్యాల గారి తో మొదలెట్టిన సినిమా “అన్నమయ్య”. ఈ సినిమాకి ఆత్రేయ గారు రచయిత. జంధ్యాల గారి దర్శకత్వం అనుకున్నారు. రమేష్ నాయుడు గారు సంగీతం.దీనికోసం రమేష్ నాయుడు గారు చాల శ్రమపడ్డారు. దాదాపు గా అప్పుడు చిత్రపరిశ్రమలో ఉన్న గాయకులు అందరితో పాడించాలి అనుకున్నారు. బొంబాయి నుంచి ఆశాజీ వచ్చి ఏమి తీసుకోకుండా పాడి వెళ్లారు. అలాగే మంగళం పల్లి బాలమురళి గారు కూడా ఏమీ తీసుకోలేదు. సినిమా అనౌన్సుమెంట్ కూడా జరిగింది…కాని ఏవో కారణాలవల్ల వాయిదా పడింది. దాదాపు గా స్క్రిప్ట్ వర్క్ ముగిసే సరికి ఆత్రేయ గారు పోయారు. తరవాత శాండిల్య గారు పోయారు. దాంతో నాగేశ్వర రావు గారు చెయ్యను అన్నారు. ఆ తరవాత రమేష్ నాయుడు గారు, జంధ్యాల గారు కూడా పోయారు. అలా ఆ ప్రాజెక్ట్ మూల పడింది.
జంధ్యాల గారి కల కలగానే మిగిలిపోయింది…
మిత్రులు శ్రీ అట్లూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
Comments:
B.Ravikumar. 14 weeks ago
B.Raviklumar… 14 weeks ago
g. sreenivas reddy… 15 weeks ago
Leave a Reply
You must be logged in to post a comment.