‘సంధ్యారాగంలో శంఖారావం’ నాటకం రాసి వేస్తున్న రోజుల్లోని మన క్లాస్ మేట్, (నాకు గ్లాస్ మేట్ కూడా, అసలీ క్లాస్ మేట్ గ్లాస్ మేట్ పదాన్ని కాయిన్ చేసింది కూడా జంధ్యాలే) జేవీడీఎస్ ఫోటో పోస్ట్ చేసి నాటి క్లాస్ మేట్లందరికీ ఎంతో చక్కని కానుక ఇచ్చిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు సురేష్ మాధవపెద్ది గారికి ధన్యవాదాలు. ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో ఆరోజుల్లో కారున్న కుర్రకారు ఒక్క జంధ్యాలే. ప్రిన్సిపాల్ (సత్యనారాయణ గారు, తరువాత సుబ్బరాజు గారు) సయితం సైకిల్ మీదనే వచ్చేవారు. జంధ్యాల తన కారులో మమ్మల్ని నాగార్జున సాగర్ పిక్ నిక్ తీసుకువెళ్ళాడు. నేను అప్పుడే ఖమ్మం నుంచి వచ్చి బీకాం లో చేరిన రోజులవి. అప్పటికే జేవీడీఎస్ ప్రభ కాలేజీలో వెలిగిపోతోంది. ఆ సంగతి తెలియక నేను కల్చరల్ సెక్రెటరీ పోస్ట్ కి ఆయనతోనే పొటీ పడ్డాను. ఆయన చేతిలో వోడిపోవడం నాకో మధుర జ్ఞాపకం. ‘ఒక్క క్షణం తొందర పడి వోటు వృధా చేయకు.’ అని కరపత్రాలు వేసి పంచాను కూడా. ఆరోజుల్లో అదో కొత్తదనంగా చెప్పుకున్నారు. నేను మాస్కోలో వున్నప్పుడు దాదాపు ప్రతివారం మద్రాసుకు ఫోను చేసి మాట్లాడే వాడిని. హైదరాబాదు వచ్చిన తరువాత సరేసరి. సాయం కాలక్షేపాలకు లెక్కేలేదు
జంధ్యాల స్మృతుల్లో ప్రముఖ పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు
Leave a Reply
You must be logged in to post a comment.