ఆదిశేషుని పడగలనే శయ్యగా చేసుకుని ఠీవిగా పవళించిన ఆ నారాయణుని, ఆ శ్రీరంగశాయి వైభవాన్ని వీక్షించడానికి మూడులోకాల జనులకు ఒక్కొక్కరికి వేయి కన్నులున్నా సరిపోవేమో?
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యానికి మాళవిక, భాగవతుల వెంకట రామశర్మ చేసిన నాట్యం, గురువుగా గిరీష్ కర్నాడ్ అభినయం అద్భుతంగా మేళవించిన ఈ పాట మీకోసం.
కొలువైతివా… రంగశాయి ! హాయి !
కొలువైతివా… రంగశాయి !!
కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి
కొలువైతివా… రంగశాయి !
సిరి మదిలో పూచి తరచి రాగము రేపి
చిరునవ్వు విరజాజులేవోయి ! ఏవోయి !
కొలువైతివా… రంగశాయి !
సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట
పరచేటి ఎలదేటులేవోయి ఏవోయి
కొలువైతివా… రంగశాయి !
ఔరా.. ఔరౌరా ! ఔరా… ఔఔరా !!
రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి
వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి
సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి
ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి
జిలి బిలి పడగల శేషాహి,తెలిమల్లె శయ్య శయనించి
ముజ్జగములు మోహంబున, తిలకింపగ పులకింపగ
శ్రీ రంగ మందిర నవసుందరా పరా !
శ్రీ రంగ మందిర నవసుందరా పరా !
శ్రీ రంగ మందిర నవసుందరా పరా !
కొలువైతివా… రంగశాయి ! హాయి !
కొలువైతివా… రంగశాయి !!
కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి
కొలువైతివా… రంగశాయి !!
{source}
<iframe width=”420″ height=”315″ src=”http://www.youtube.com/embed/GflYJxIXUOg” frameborder=”0″ allowfullscreen></iframe>{/source}
ఈ కింద లింకులో శిరాకదంబం పోస్ట్ చూడవచ్చు.
http://sirakadambam.blogspot.com/2011/06/blog-post_8482.html
శిరాకదంబం ఎస్.ఆర్.రావు గారికి కృతజ్ఞతలు.
Leave a Reply
You must be logged in to post a comment.