శంకరాభరణం సినిమా నించి కొన్ని సంభాషణలు

 

(జయహో జంధ్యాల)

 

ఆ గుర్రపు డెక్కలచప్పుడులో కూడా ఆయన కోపం వినపడుతోందమ్మో

పురోహితుడికి నత్తి మనకి భక్తీ ఉండకూడదు(తులసి తల్లి.(

నేను వయసులో ఉన్నప్పుడు మా ఊళ్ళో మొగాళ్ళెవరూ కాపరాలు చెయ్యలేదు ఆ రోజుల్లో.

ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమయిన మార్గంలో పెట్టడానికే తప్ప కులంపేరుతో మనుషుల్ని విడదియ్యడా నికి కాదు తులసీ

ఆ లోకేశ్వరుడికి తప్ప లోకులకి భయపడనురా మాధవా(శంకరశాస్త్రి(

 

Here after don’t be silly, stupid and childish. Music is divine whether it is western or Indian.

సంగీతానికి భాషాభేదాలు స్వపరభేదాలు ఉండవు,అదొక అనంతమయిన అమృతవాహిని.ఏ  జాతివాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా ఆ జీవధారలో దాహం తీర్చుకోవచ్చు.ఒక రకమయిన సంగీతం గొప్పదనీ మరొకరకమయిన సంగీతం అధమయినదనీ నిర్ణయించడానికి మనమెవరం.మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్నీ అవగాహన చేసుకోకుండా మీరిలా అవహేళన చేయడం మూర్ఖత్వం.మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ఆ ప్రణవనాదాన్ని సాధనచేస్తూ ఉంటే ఈ భూమిన పుట్టిన బిడ్డలు మీరే మనదేశపు సంగీతాన్ని చులకనగా చూడ్డం కన్నతల్లిని దూషించడం అంత నేరం,ద్వేషించడం అంత పాపం.

 నేను సంపాదించి ఆస్తి కరిగిపోయినా ఆ భగవంతుడిచ్చిన స్వరం కరిగిపోలేదయ్యా.నేను బాధపడేది తిండిలేని రోజున కాదయ్యా నేను పాడలేనిరోజున.

 

అక్షరాల్ని నీ ఇష్టమొచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనంచెయ్యడమేనటయ్యా ప్రయోగం అంటే.

దాసూ ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు,ఎదురుదెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరొకలా అంటాడు,నిద్రలో ఉలిక్కిపడిలేచిన పాపడు అమ్మా అని మరొకవిధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్ఠమయిన నాదం ఉంది,శృతి ఉంది,స్వరముంది.ఆ కీర్తనలోని ప్రతీ అక్షరం వెనుకా ఆర్ద్రత నిండిఉంది దాసూ.

తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండెలోతుల్లోంచి తనకుతానే గంగాజలంలా పెల్లుబికిన గీతమది రాగమది.మిడిమిడిజ్ఞానంతో ప్రయోగం పేరిట అమృతతుల్యమయిన సంగీతాన్ని అపవిత్రం చెయ్యకయ్యా.మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమయిన సంగీతాన్ని అపభ్రంశం చెయ్యకు.  

 

కాలక్రమేణా సంగీతంలో అనేక మార్పులొచ్చాయ్.ఉదాహరణకి వాటెయ్యనా కాటెయ్యనా,కరిచెయ్యనా కొరికెయ్యనా అనేటువంటి సాహిత్యమూ, మలేరియా వ్యాధిగ్రస్తుడి వణుకులాంటి సంగీతమూ తయారయ్యాయి.అనేక శబ్దాలు కూతలు కేకలు అరుపులు నిట్టూర్పులూ సంగీతంలో చోటుచేసుకున్నాయ్.ఈ స్థితిలో తన గానానికి ఆదరణ లేని దశలొ మన శాస్త్రి గారు తన ఇంటి నాలుగు గోడల మధ్య అదే సభావేదిక అనుకుని, క్రిమికీటకాలే రసికతగల శ్రోతలనీ సంగీత సాధనని కొనసాగిస్తూ వచ్చారు.

 

సభకు నమస్కారం….

పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు రెపరెపలాడుతున్నా సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతిని అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో,వారికి శతసహస్ర వందనాలర్పిస్తున్నాను.

శుష్కించిపోతున్న భారతీయ సంస్కృతినీ సాంప్రదాయాన్నీ పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనీషికి శిరశువంచి పాదాభివందనం చేస్తున్నా.ఈ కళ జీవకళ,అజరామరమయినది.దీనికి అంతం లేదు,నిరాదరణపొందుతున్న ఈ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్కవ్యక్తి ఉన్నా సరే ఈ అమృతవాహిని ఇలా అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.మనిషి నిలువెత్తు ధనంసంపాదించినప్పటికీ

దొరకునా ఇటువంటి సేవ

నీపద రాజీవముల చేరు నిర్వాణ సోపాన

మధిరోహణము సేయు త్రోవా  

Be the first to comment

Leave a Reply