జంధ్యాల 1951 జనవరి 14 న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించాడు. బి.కామ్ వరకు చదువుకున్నాడు. చిన్నతనం నుండీ నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవారు. స్వయంగా నాటకాలు రచించాడు. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి.
1974 లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేసాడు. శంకరాభరణం, సాగరసంగమం, అడవిరాముడు, వేటగాడు వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు రాశాడు. ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారి, శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించాడు.
జంధ్యాల 2001 జూన్ 19 న హైదరాబాదులో గుండె పోటుతో మరణించాడు. ఆయనకు ఇద్దరు కూతుర్లు. వారి పేర్లు సాహితి, సంపద.
Comments:
ramana @ http://jandhyavandanam… – జంద్యాల …
12 weeks ago · 0 replies · 0 points
B.Ravikumar @ http://jandhyavandanam… – జంద్యాల …
14 weeks ago · 0 replies · 0 points
Leave a Reply
You must be logged in to post a comment.