హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావుకి నివాళి

 

చంటబ్బాయ్ సినిమాలో ఇంగ్లీషు మాట్లాడే బట్లరు పాత్రలో “ఏరా సెవెన్ హిల్సు, ఇది ఆరోసారి రాంగ్ నంబర్ స్పీక్ చేయడం. ఏమి ఆటలుగా ఉందా..ఆహా గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను. నాతో పెట్టుకోకురా రేయ్. కుంతీ సెకండ్ సన్ బూన్, అదే భీమవరంలో వన్ ఏడాది క్రితం ఒకడిని చావ హిట్టాను. కీపెయ్యి. రెస్పెక్ట్ గా ఫోన్ కీపెయ్యి.” “గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్..అదేనమ్మా తోటకూర”  అంటూ నవ్వులు కురిపిస్తారు.

 

 

 

కేవలం హాస్య పాత్రలే కాకుండా స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ ఆస్తి కాజేసే విలన్ పాత్ర పోషించారు. అహనా పెళ్ళంట సినిమాలో తన పిసినారి బావ (కోట శ్రీనివాసరావు) చేష్టలకు మతికోల్పోయే కలెక్టరుగా చిన్న పాత్రలో కనిపిస్తారు. పడమటి సంధ్యారాగం సినిమాలో గుమ్మలూరి శాస్త్రిగారిగారి మాటలు వింటూ, నటన చూస్తుంటే ఆయనకు డబ్బింగ్ చెప్పిన సుత్తి వీరభద్రరావుగారే గుర్తుకొస్తారు. ఇక వివాహ భోజనంబు తర్వాత వచ్చిన చూపులు కలసిన శుభవేళ సినిమాలోని “గుండు పాండురంగం” ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర.

 

 

 

 

 

 

 

 

ఘంటసాల పాటలను అమితంగా ఇష్టపడుతూ ఆరాధించే గుండు పాండురంగం ఆరోగ్యానికి మంచిదని తన దగ్గరకు వచ్చిన వాళ్ళనూ, తన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులనూ కిలోమీటర్ల కొద్దీ నడిపించుకొని వెళ్ళి వాళ్ళను అక్కడే వదిలేసి తన కారులో తిరిగి వచ్చేస్తాడు. ఇప్పటికీ ఎవరయినా “అలా వాకింగ్ వెళ్తూ మాట్లాడుకుందామా” అంటే ఒక్క క్షణం గుండు పాండురంగం గుర్తుకొచ్చి గుండె గుభేల్మంటుంది!

 

 

 

 

 

 

 

 

 

చూపులు కలసిన శుభవేళ సినిమా అపుడు అనారోగ్యానికి గురి అయిన, వైద్యం వికటించి 1988, జూన్ 30న కేవలం 40 ఏళ్ళ వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దశాబ్దకాలం పాటు ఎన్నో మరచిపోలేని పాత్రలలో నటించి ఆరోగ్యకరమయిన హాస్యానికి చిరునామాగా నిలిచిన ఈ హాస్య చక్రవర్తి,  తనూ తొందరగా వెళ్ళిపోయిన ఆయనను సృష్టించిన హాస్యబ్రహ్మ జంధ్యాల స్వర్గంలో అందరినీ నవ్వించింది ఇక చాలనుకొని మళ్ళీ భూమిమీద పుడతారని ఆశిద్దాం.

 

బ్లాగర్ జీడిపప్పు గారికి ధన్యవాదాలు

 

 

Be the first to comment

Leave a Reply