పడమటి సంధ్యారాగం సినిమా – ముద్దుగారే యశోద

పడమటి సంధ్యారాగం సినిమాలో “ముద్దుగారే యశోద” అన్న పాట వెనక ఒక ఆసక్తికరమైన కధ ఉంది. అమెరికాలో ఈ చిత్రం బాగోగులు చూసుకునే వారికి ఓ బాబు ఉన్నాడు.ఆ బాబు జంధ్యాల దృష్టిని ఆకర్షించాడు.ఆ అబ్బాయిని చిన్ని కృష్ణుడిలా అలంకరించి ఓ పాట చిత్రీకరించాలనుకున్నారు.కానీ ఆ అబ్బాయి అస్సలు సహకరించలేదు.ఫ్లూట్ ఇస్తే విరిచేసేవాడు,అలా చాలా ఫ్లూట్లు విరక్కొట్టేసాడు,నవ్వుతూ మొహం పెట్టు అంటే కెమేరా ఆన్ అయ్యేసరికి వెక్కిరించేవాడు,కెమేరా చిత్రీకరించగలిగే ఫీల్డ్ లోంచి పారిపోయేవాడు,నడుస్తూ రా అంటే దొర్లేవాడు,అలా కొన్ని వందల అడుగుల ఫిల్మ్ ఎక్స్‌పోజ్ అయిపోయింది.జంధ్యాల ఊరుకోలేదు,వాటన్నిటినీ చాలా తెలివిగా ఎడిట్ చేసి ‘ముద్దుగారే యశోదా అన్న అన్నమయ్య కీర్తనని జతచేసారు.ఇవాళ ఆ పాటని చూస్తుంటే బాలకృష్ణుడి అల్లరిలా ఉంటుందే తప్ప మరోలా ప్రేక్షకుడికి తట్టే అవకాశం లేదు,అదీ జంధ్యాల సృజనాత్మకత.ప్రేమానుభూతిలో సంధ్య మునిగితేలుతున్న సమయంలోనే ఈ పాట పెట్టడం ఓ గొప్ప ఆలోచన.

Be the first to comment

Leave a Reply