పర్సనల్ ట్రివియా
- విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కాలేజిలో జంధ్యాల, అశ్వనీదత్, సుత్తి వీరభద్రరావు తదితరులు క్లాస్మేట్స్ ట!
- జంధ్యాలను ఒక గంట కలిసిన మనిషికి కొన్నేళ్ళుగా స్నేహం ఉందేమో అనిపించే ఫీలింగ్ కలిగేదిట!
- ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువ. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, వైజాగ్.. … ఎక్కడికక్కడ ఫ్రెండ్స్ గ్రూప్ ఉండేదట!
- ప్రాక్టికల్ జోక్స్ వేయడం ఈయనకు చాల ఇష్టమట! అలాగని ఏది ఎవరినీ నొప్పించేలా ఉండేది కాదట!
- జంధ్యాలకి మ్యాజిక్ లో కూడా కొంత ప్రవేశం ఉందట! మరి అది పట్టాభిరాం స్నేహంతో అలవడిందేమో!
- తనకున్న దురవాట్ల గురించి కూడా జోకులేసేవారట! రైటరన్నాక ఏదో ఒక అలవాటు లేకపోతే బాగుండదు అనేవారట!
ప్రొఫెషనల్ ట్రివియా..
- ఫిలిం ఫెస్టివల్స్‌కు వెళ్ళడం ఇష్టపడేవారట!
- మొదట్లో జంధ్యాల-సత్యానంద్ జంట రచయితలుగా ఆరేడు సినిమాలు చేశారట!
- ఆరోజుల్లో సౌత్ ఇండియాలోనే అతివేగంగా స్క్రిప్ట్ రాసే (3 గంటల్లో 10-12 సీన్లు) సినీ రైటర్ ఈయనే అనుకు నేవారట!
- పదిమంది ఫ్రెండ్స్ తో కూర్చుంటే.. ఎవరేం మాట్లాడినా, జోకేసిన అది తర్వాత ఏదో ఒకటి సినిమాలో కనబడేదట!
- రూంలో కూర్చుని రాయడంకన్నా ప్రకృతిలో కూర్చుని (కొండలు, బీచ్‌లు, వ్యాలీలు…) రాయడం ఇష్టపడేవారట!
- కథలు రాయడం, డైలాగ్స్ రాయడం, దర్శకత్వం చేయడం… మూడింటిలో కథలు రాయడంలోనే కొంచం పటుత్వం తక్కువ ఉండేదట!
- ‘భారదేశమంతా ఆహా! అనేలా ఎప్పటికైనా ఒక సినిమా తీయాలి అని స్నేహితులతో అప్పుడప్పుడు అనేవారట!
- సినిమాల్లోనే కాదు, సభల్లో కూడా ఆయన చాతుర్యాన్ని మాటల ద్వారా చాటేవారట! అవన్నీ ఆయనకు ఆశువుగా వచ్చినవేనట!
- సెట్లలో విశ్వనాధ్‌గారు ఖాకి బట్టలు వేసుకున్నట్లు ఈయన తెల్లబట్టలు వేసుకునేవారటా!
- ఆయన ఎక్కువ శాతం సినిమాలకు నృత్య దర్శకులను పెట్టుకునేవారు కాదట!
- అతిశయోక్తి ఉంటే తప్ప కామెడీ పండదని నమ్మి, అలా తీసి, హిట్స్ మీద హిట్స్ అందించిన దర్శకులు జంధ్యాల.!
సరదాగా కొన్ని…
- జంధ్యాలగారి తల్లి పేరు ‘సూర్యకాంతం ‘ అట! ఆయన్ని ఏవరైనా ‘మీ అమ్మగారిపేరేంటి!’ అని అడిగితే చాలా సిగ్గుపడిపోయేవారట!
- ‘శ్రీవారికి ప్రేమలేఖ ‘లో వీరభద్రరావు క్యారెక్టర్ జంధ్యాల గారి తండ్రి నుంచే పుట్టిందిట! చిన్నప్పటినుంచీ జంధ్యాలగారికి ఆయనంటే భయమట!
- ఆయన ప్రతీదీ హాస్యంగానే చెప్పేవారట! చాలాకాలం తర్వాత సాహితి, సంపద పుట్టినప్పుడు భగవంతుడు పొరపాటు చేశాడని తెలుసుకుని, నాకు వడ్డీతో సహా ఇచ్చాడూ అన్నారట.
మాటల మూటలు:
‘ఒక్క యాక్టింగ్‌లోనే కాదు జీవితంలో ప్రతిచోటా అబ్జర్వేషన్ ముఖ్యం!
‘మనం క్రియేటర్స్ మి… మనం పనీ వెతుక్కోవడం కాదు, పనే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది!’
‘విశ్వనాథ్ గారు నా కెరియర్‌కి నూనే పోస్తే, రాఘవేంద్రరావుగారు దానికి దీపం వెలిగించారు!’
‘పైన ఒక బ్యూటిఫుల్ యూనిట్ తయారయ్యుండుంటుంది..ఆత్రేయగారు, రేలంగిగారు, ఎస్వీఆర్ గారు.. ఎప్పుడో మనకీ పర్మిషన్ వస్తుంది. అక్కడ కూడా మనం వాళ్ళని నవ్వించొచ్చు ‘!
ఫామిలీ పత్రిక సౌజన్యంతో (కృతజ్ఞతలు: సత్యానంద్, చిన్నారయణ.)
యూనికోడీకరించినవారు: రమణి రాచపూడి
Leave a Reply
You must be logged in to post a comment.