హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు (మూడవ భాగం)

సుత్తి వీరభద్రరావు పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చే సినిమా “వివాహ భోజనంబు”. రకరకాల ఆసనాలు వేస్తూ తన ఇంట్లో అద్దెకుంటున్న కవి అయిన బ్రహ్మానందానికి “సినిమా స్టోరీ” చెప్పే పాత్రను ఆయన పోషించారు. సినిమా రచయిత కావాలనుకొనే బ్రహ్మానందం ఓ కథ చెబితే దాన్ని తీసిపారేసి ఊళ్ళు, సందులు, ఆహారపదార్థాల జాబితా చెప్పి ఇలా సినిమా తీయాలంటాడు. తెవికీనుండి సంగ్రహించిన ఆ సరదా సంభాషణలు:

మట్టి పూసుకొని ఉన్నపుడు బ్రహ్మానందం సంభాషణ–(ఏడుపు గొంతుతో) ఈ చెమ్మంతా ఇగిరేలోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాఏమో మహాప్రభో. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే . “జూ” వాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళి పోతారు. జనమెవరయినా చూస్తే ఇతర గ్రహాలనుండి వచ్చారనుకొని రాళ్ళుచ్చుక్కొడతారు… (ఆశగా) ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభో.

కధ చెప్పమని–ఈ కథ సినెమాగా తీస్తే నేను అడుక్కుతినాల, ఓ వూరు వూరంతా పస్తుండి నాకు ముష్టెయ్యాల్సొస్తుంది. అరే ఇన్నాళ్ళనుండి సూత్తన్నాను. సినిమాకు పనికొచ్చే ఒక కథ కూడా సెప్పలేనోడివి నువ్వేం కవివయ్యా అసలు. నేనొక గొప్ప కథ సెప్తాను ఇనుకో.మధ్య తరగతి ఎదవనాయాలా.

మహాప్రభో తమరు నన్ను తిట్టారా?

లేదు సినిమా పేరు చెప్పా–ఆ పేరు తిట్టులా ఉంది మహాప్రభో –పేరులో తిట్టుంటేనే సినిమా హిట్టవుద్దయ్యా

తెర లెగవంగానే ఈరో ఒక కాఫీ ఓటల్కు ఎల్తాడు. సర్వర్ రాగానే ఈరో ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు సర్వరు “ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా” ఉన్నాయంటాడు.

అప్పుడు ఈరో “అట్టు తే” అన్నాడు

అప్పుడు సర్వరు ” యే అట్టు? పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మషాలా అట్టా, 70mm అట్టా, MLA అట్టా, నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిలేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా ” అని అడిగాడు

అప్పుడు ఈరో పెసరట్టు నెయ్యేసి కాల్చమన్నాడు, కాఫీ కూడా తెమ్మన్నాడు

అప్పుడు సర్వరు “యే కాపీ మామూలు కాపీయా,స్పెసలు కాపీయా, బుర్రూ కాపీయా, నెస్కాఫీయా, బ్లాక్ కాఫీయా, వైటు కాఫీయా హాటు కాఫీయా, కోల్డు కాఫీయా , నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు ” అని అడిగాడు

అప్పుడు ఈరో మామూలు కాపీ తెమ్మన్నాడు

అప్పుడు సర్వరు “నీలగిరి కాపీయా, హిమగిరి కాపీయా, సిమలా కాపీయా’

ఆపండి మహాప్రభో, తమలో ఇంత వూహాశక్తి ఉందని వూహించలేకపోయాను. ఈ కథనే సినిమాగా తీసుకోండి. పది వేల రోజులు ఆడుతుంది జనం వ్రుద్దులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనం అయిపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో నన్ను వదిలెయ్యండి మహాప్రభో నన్ను వదిలెయ్యండి

                                                     ********  
మహాప్రభో అద్దె బాకీ మాఫీ చేస్తానని తమరు నన్నిలా శంకుస్థాపన టైపులో పాతిపెట్టి తమరలా విష్ణుమూర్థిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభో

నిన్ను నేను పాతిపెట్టాను కదా, నన్ను పాతి పెట్టే మడిసి కోసం సూత్తన్నానయ్యా

నన్ను తొరగా బయటకి లాగండి మహాప్రభో. ఏ ఊరకుక్కాన్నా దగ్గరికొచ్చి కాలెత్తిందంటే పావనమైపోతాను. లేదా యే అల్సేషనో ఇసుకలో బంతి పడిందని నా తల నొట కరుచుకొని వెళ్ళిపోతే కీర్తిశేషుడిని అయిపోతాను. చీ ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని వెధవ బ్రతుకు అయిపోయింది నాది

స్షో ఆట్టే వాగావంటే తిత్తి తీస్తా. నువ్వు సెప్తున్న కథలో ఏదో లోపముందయ్యా కవీ. నేను ఆలోసించి పెట్టుకున్న సిన్న లైను ఇనిపిస్తాను ఇనుకో:

వో ప్యామిలీ మంగలగిరి తిరణాలకెల్తారు. ఆళ్ళ కొడుకు ఆరేళ్ళ గుంటడు ఆ జనంలో తప్పోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడికోసం బావురుమంటారు

ఆహా సెంటిమెంటు బాగుందండయ్యా. మొదటి సారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి

ఆడి తండ్రి ఆడికోసం వూళ్ళన్నీ గాలించడం మొదలుపెట్టాడు. యే యే వూళ్ళు తిరిగాడో తెలుసా?

ఐదరాబాదు, అదిలాబాదు, సికిందరాబాదు, అహమ్మాదాబాదు, ఫకీరాబాదు,అలహాబాదు, ఫరీదాబాదు. ఔరంగాబాదు, తనబాదు (??), సింధుబాదు,ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జపారాబాదు, వుస్సేనుబాదు.

 

(బ్రహ్మం ఏడుస్తూ) నా బొందబాదు, నా శ్రాద్దంబాదు, నా పిండాకూడు బాదు

ఆ ఆ ఆటన్నిటితో కలిపి మొత్తం ఇరవయ్యొక్క బాదులు ఎతికాడు. సివరాఖరికి యెవుడో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడని సెప్తే ఆ వూరెళ్ళాడు.

బెజవాడలోగవర్నరుపేట, లబ్బీ పేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతీ నగరం, మొగల్రాజపురం, భవానీపురం, సత్యన్నారాయనపురం, సీతారామపురం…

వద్దు బాబోయ్, చాలు మహాప్రభో చాలు, బెజవాడంతా వెతికేసాడనుకుందాం ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభో.

అన్నీ పేట్లెతికినా ఆ గుంటడు దొరకలేదయా, అప్పుడు…

పారిపోవడానికి కూడా వీలులేని పరిస్థిథిలో పడిపోయాను మహాప్రభో

ఇను ఇక్కడే ఇక్కడే తమాషగుంటంది అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. యే యే రోడ్ల మీద పడ్డాడో తెలుసా? బీసెంటు రోడ్డు, బందరు రోడ్డు, యేలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టిక్కల రోడ్డు, కారల్ మార్క్సు రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టవును రోడ్డు, అద్దంకివారి వీధి, తాళంకివారి వీధి, దాసరివారి వీధి, మల్లెలవారి వీధి, పుల్లెలవారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోడా టాకీసు వీధి, అచ్చమామబ ఆస్పత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి…

మహాప్రభో ఆపండి, ఇది సినిమా కథా? ఈ లెక్కన పోస్ట్ మ్యాన్లు అత్యద్భుతమయిన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా పందొచ్చి తల కొరికినా ఇంతకంటే సుఖంగా ఉంటుంది మహాప్రభో!!
 

మిగతాది మూడవ భాగంలో

బ్లాగర్ జీడిపప్పు గారికి ధన్యవాదాలతో…

 

Be the first to comment

Leave a Reply