సాగర సంగమమే…ప్రణయ సాగర సంగమమే…..

 భారతీ రాజా గారి  ” సీతాకోక చిలుక” గురించి జంధ్యాల గారి మాటల్లో….  

సాగరసంగమం సీతాకోక చిలుక “   ఏంటీ  అనుకుంటున్నారా? కాఫీ కి స్పెల్లింగ్ KAUPHY అని ఒక అక్షరానికి ఇంకొక అక్షరానికి సంబంధం లేకుండా చెప్పింది గుర్తొస్తోంది కదా  ….. ఇదిగో అసలు విషయానికి వచ్చేస్తున్నా జంధ్యాల గారి ఇంటర్వ్యూ నుండి సేకరించిన విషయం ఇది…. 

భారతీ రాజా గారు మురళి, అరుణ  హీరో హీరోయిన్స్ గా  ఒక మంచి ప్రేమకథని తీద్దామని అనుకున్నారు., 90 శాతం షూటింగ్ కూడా అయింది. ఈ సినిమా కి జంధ్యాల గారు  మాటల రచయిత. 

అయితే ఈ సినిమా కి టైటిల్ సాగర సంగమం’ అయితే బాగుంటుంది అని జంధ్యాల గారు  భావించారు…. (.అప్పటికింకా కె. విశ్వనాథ్ గారి సాగర సంగమం సినిమా రాలేదు)  అందుకని  భారతీ రాజా గారితో జంధ్యాల గారు ఇలా చెప్పారుట ఇది ఒక ప్రేమ కథ..ఒక హిందూ అబ్బాయి కి, ఒక క్రిస్టియన్ అమ్మాయి కి మధ్య ప్రేమ కథ. ఈ రెండు మతాలు రెండు నదులు లాంటివి అయితే ప్రేమ అనే సాగరసంగమం వద్ద నదుల లాంటి ఈ రెండు మతాలు కలవడమే ఈ చిత్ర ఇతివృత్తం. కాబట్టి ఈ సినిమా కి సాగరసంగమం టైటిల్ అయితే బాగుంటుంది ” అని. అందులోనూ అప్పటికే “సాగర సంగమమే..” అనే పాట కూడా ఈ చిత్రం కోసం రికార్డ్ చేసి షూట్ చేసారు. కాబట్టి అన్నివిధాలా ఈ సినిమా కి సాగరసంగమం అనేది కథాపరంగా సరిపోయే  టైటిల్ అని భావించారు జంధ్యాల. 

అయితే దీనికి భారతీ రాజా గారిచ్చిన సమాధానం జంధ్యాల గారిని ఆశ్చర్యపరిచిందట! ఇంతకీ భారతీ రాజా గారిచ్చిన సమాధానం  ఇదిగో మీరు చదవండి

ఈ సినిమా కి కథాపరంగా సాగర సంగమం అనే టైటిల్ కథాపరంగా సరిపోయేది అయి వుండొచ్చు, అంత చక్కని టైటిల్ పెట్టామనుకుని మనం సంబర పడిపోవచ్చు..కానీ ఒక్క సారి ప్రేక్షకుడి వైపు నుంచి ఆలోచింఛండి. సాగర సంగమం అనే టైటిల్ చూడగానే ఇదేదో బాగా బరువైన కథ వున్న సినిమా అనుకుంటారు. మనది ప్రేమ కథ. కుర్రాళ్ళని ఆకట్టుకునేలా టైటిల్ వుండాలి కానీ వాళ్ళని బెదరగొట్టేలా కాదు..సాగర సంగమం అన్న టైటిల్ చాలా మంచి టైటిల్. మన సినిమా కథ కి కూడా చక్కగా సూట్ అయ్యే టైటిలే..కానీ మనం ఆ టైటిల్ ని మన సినిమా కి పెట్టలేము..”

సీతాకోక చిలుక మాటలు, కథనం, పాటలు రికార్డ్లను బద్దలు కొట్టిందని అందరికీ తెలిసిందే..

Be the first to comment

Leave a Reply