మా గురించి

 మేము జంధ్యాల అభిమానులం మీలాగే… 

నవ్వడం ఒక భోగం,నవ్వించడం ఒక యోగం.నవ్వకపోడం ఒక రోగం అన్నారు జంధ్యాల.

మనిషి శరీరంలో నవ్వడం అనే ప్రక్రియకి పదో పరకో కండరాల అవసరం అయితే,అదే కోపానికీ ఆవేశపడడానికి కొన్ని వందల కండరాల అవసరం పడుతుందని శాస్త్రజ్ఞులు చెప్తారు.

అలాంటి నవ్వుని తన సంభాషణల ద్వారా,పాత్రల చేష్టితాల ద్వారా మనకి అందించి,నిరంతరం మనల్ని నవ్విస్తూ,తాను మనందరి నవ్వుల్లో చిరంజీవి అయిన మనిషి జంధ్యాల.

నవ్వు” అన్న ఒక బ్లాంక్ చెక్కు మీద సంతకం చేసేసి “శిబి”చక్రవర్తిలా మనకి దానమిచ్చేసి మీకు కావాలసినంత నవ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకుని మనసారా నవ్వేసుకుని నలుగురు కలిసి నవ్వేవేళా నాపేరొకపరి తలపండి” అన్నట్టు నన్ను తల్చేసుకోండని చెప్పేసి తను మాత్రం మన నవ్వుల పూతోటలో ఎప్పటికి కళకళలాడుతూ నవ్వుతూ ఉండిపోయే చిరంజీవి అయిపోయారు జంధ్యాల.

ప్రతీ జీవీ పుట్టినతర్వాత బ్రతికినంతకాలం జీవించాక మరణిస్తుంది.కానీ మరణానంతరం కూడా జీవించే వాళ్ళు కొంతమందే ఉంటారు.అదిగో ఆ కోవలోకే వస్తారు జంధ్యాల.

అటువంటి “జంధ్యాల” గుర్తుగా ఈ వెబ్ సైట్ వారి అభిమానులందరికీ కానుకగా ఇవ్వాలనే సత్సంకల్పమే ఈ మాచిన్నిప్రయత్నం.అబిమానులందరూ వారి వారి సూచనలు అందచేయాల్సిందిగా కోరుకుంటున్నాము.

 

 

 

 

Comments:

KILLAMSETTY HARI @ http://jandhyavandanam…మా గురిం…

10 weeks ago · 0 replies · 0 points

VIEWERS,MEEKO NIJAM CHEPPANA! MANAM E.V.V SATYANARAYANA CINEM,A LU CHUSI MECHUKUNTAMAA.ATHANU KUDA JANDHYALA SCHOOL NUNCHEY VACHADU. MANAM SACHINAKA KUDA MANA GURUNCHI MAATLADUKOVALI.KANI NENU E.V.V NI MATRAM MARACHIPOLENU,ENDHUKANTEY ATHANI CINEMALU CHUSEY COMEDY NI ISTABADDA.E.V.V DWARANEY JANDHYALA ANTEY ENTO TELUSUKOGALIGA. UNTANEY  TATA  BIRLA  PLEASE SOUND HORN

kastephale @ http://jandhyavandanam…మా గురిం…

10 weeks ago · 0 replies · +1 points

అన్ని జీవరాసులలో, నవ్వు మానవుడొక్కడికే సాధ్యం, మరి, జంధ్యాల అమరజీవి.

Admin @ http://jandhyavandanam…మా గురిం…

12 weeks ago · 0 replies · 0 points

Please check your spam folder

B.Ravikumar @ http://jandhyavandanam…మా గురిం…

13 weeks ago · 1 reply · 0 points

మీ రెస్పాన్స్ కి థాంక్సండీ.. వెయిట్ చేస్తాను. అన్నట్లు ఈ వెబ్ సైట్ లో మీరు ఇచ్చిన రెస్పాన్స్ తాలూకు ఆటోమాటిక్ నోటిఫికేషన్ ఈమెయిల్ నాకు రాలేదు… ఏదన్నా ప్రోబ్లెమేమో చూడండి.

శ్రీనివాస్ పప్పు @ http://jandhyavandanam…మా గురిం…

13 weeks ago · 0 replies · 0 points

రవికుమార్ గారూ జంధ్యామారుతం పేరుతో పులగం చిన్నారయణ గారు రెండు భాగాలు వ్రాసారండీ,దాని మీద సమీక్ష కొద్ది రోజుల్లో ప్రచురిస్తాం.(ఆంధ్ర ప్రభ లో శీర్షిక విషయం గురించి కూడా ప్రయత్నిస్తున్నాం)  
ఇంకా ఆడియో విభాగంలో సంభాషణల గురించయితే చాలావరకూ అవన్నీ విడియో విభాగంలో పెడుతున్నామండీ.అందుకని ఇంకా అడియో విభాగంలో పెట్టలేదు,సమయం చూసి అందులో కూడా పెడతాం.

B.Ravikumar @ http://jandhyavandanam…మా గురిం…

14 weeks ago · 0 replies · 0 points

ఆడియో సెక్షన్లో ఆయన రాసిన డైలాగ్స్ క్లిప్పింగ్స్ పెడితే బావుంటుంది – ఆయన సినిమాల్లో వేటూరి రాసిన పాటలు కాకుండా. ఆఫ్ కోర్స్! ఆయన సినిమాల్లో పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయనుకోండి.

B.Ravikumar @ http://jandhyavandanam…మా గురిం…

14 weeks ago · 0 replies · 0 points

ఆంధ్రప్రభ వారపత్రిక లో ఒకప్పుడు జంధ్యాల గారి వ్యాసాలతో ‘జంధ్యామారుతం’ అనే శీర్షిక వచ్చింది.. చాలా బావుండేవి ఆ వ్యాసాలు.. ఎక్కడన్నా దొరుకుతాయా అవి?

శ్రీనివాస్ పప్పు @ http://jandhyavandanam…మా గురిం…

14 weeks ago · 0 replies · 0 points

రాజా గారూ…మీ అభిప్రాయానికి సంతోషం.ఏ బెంచీలో కూర్చున్నాం అన్నది కాదన్నయ్యా కొచ్చను,పాసయ్యామా లేదా అన్నదే పాయింట్(హ్హహ్హహ్హ).మీ వంతుగా మీరు కూడా ఏమన్నా జంద్యాల గారి గురించిన సేకరణలు ఏమన్నా ఉంటే మాకు పంపితే ప్రచురిస్తామండీ. 

జి.కె.ఎస్. రాజా. @ http://jandhyavandanam…మా గురిం…

14 weeks ago · 0 replies · 0 points

జంధ్యాల గారి అభిమానులూ! మేమూ మీ బాపతేనండి! తేడా అల్లా మీరు ముందు బెంచీ, మేం ఎనక బెంచీ ..అంతే! ముందు ఉన్నందుకు అన్నీ జాగ్రత్త గా చూసుకోవాలి మీరు. మేము అప్పుడప్పుడూ పరీక్షలకొచ్చి కాపీ కొట్టి పోతుంటాం. కాని మళ్లి మళ్లి వస్తూనే ఉంటాం— మార్చి, సెప్టెంబరు,మార్చి — అలా అన్నమాట.  నవ్విస్తూ, ఆయన్ని బతికిస్తూ ఉండకపోతే మాత్రం మర్యాదగా ఉండదండోయ్!  రాజా.

Siva Rama Prasad @ http://jandhyavandanam…మా గురిం…

17 weeks ago · 0 replies · 0 points

హృదయపూర్వక ఆభినందనలు..Prasad

శివ బండారు @ http://jandhyavandanam…మా గురిం…

18 weeks ago · 0 replies · 0 points

మంచి ప్రయత్నం. శుబాభినందనలు

హరే కృష్ణ @ http://jandhyavandanam…మా గురిం…

21 weeks ago · 0 replies · 0 points

హృదయపూర్వక ఆభినందనలు 

 

Be the first to comment

Leave a Reply